Wednesday, May 16, 2007

కొంటె పెళ్ళాం..కాదంటె కష్టం ....

కొంగు ముడేసుకొని..తలమీద చెయ్యి వేసి...యేడడుగులు నడిచిందంటా...
పల్లెటూరి నుండి పట్నానికి వొచ్చింది...పిల్లకాదది..పిడుగంటా...
పట్నంలొ కన్నెలను చూసింది..కట్టు బొట్టు మార్చిందంటా..
ఆఫీసు లేదు..పని లేదు..కారులో ఊరు షికారు తిప్పాలంటా....

టెలివిజన్లో చీరల,బంగారాల మోత..వాటిని ఇప్పటికిప్పుడు కొనాలంటా...
అడిగినవన్నీ అందాలంటా.. లేకపోతె..అలకపాన్పు దానికి అందమంటా...
చుట్టాలు వొద్దు..స్నేహితులొద్దు...ఇద్దరమే కలిసుండాలంటా..
అమెరికా పోదాం...అందాలు చూద్దాం....కొత్త పాట మొదలెత్తిందంటా..

అది వొద్దు..ఇది వొద్దు అంటె.....లబొదిబొ అని ఊరంత గోలంటా.
అందం చందం దాని సొంతమంటా..ఎక్కడికెల్లిన..పోరగాల్లంతా పొగంటా.
అదృష్టమంటీ నాదే అంటా..మొగుడంటే...కొండంత ప్రేమంటా..
కాదు అంటె దానితో కష్టమంటా..నోరు కాదది ఊరికె లౌడుస్పీకరంటా.

చదివిందెమో..బోడి డిగ్రీ అంటా....లక్షలు తెచ్చే జీతం కావలంటా...
ఫలాన హీరోలాగ ఉండాలంటా..కండలు నీనే పెంచాలంటా..
కవితలు ఎన్నో రాయాలంటా. అవన్నీ తనకే అంకితమంటా....
పిల్లలు అప్పుడే ఎందుకు..తొందరెందుకు .....హద్దులో నీనె ఉండాలంటా..

పట్నమొద్దు బోరు బోరు..ఇక్కడెవరూ లేరు.....పల్లెటూరే దానికి నచ్చిదంటా...
అదెవరో కాదు..ఇంకెవరు...అది అదె నా ముద్దుల పెళ్ళామంటా.

1 comment:

shiva said...

Anti ra Uppi ga kavithvam rathunnavu...ni panani ki bagaladha.. endhukooooo...

so ni wife eppuday anni konamantundha........any its good and so funny...enthaku kavithalu evarusar ra bhagunay......